Mon Mar 16 2026 04:24:50 GMT+0530 (India Standard Time)
భీమవరానికి బయలుదేరనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి 2.15 గంటలకు భీమవరం నియోజకవర్గంలోని పెద అమిరం చేరుకుంటారు. అక్కడ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు నివాసానికి చేరుకుంటారు.
నివాళులర్పించి...
పాతపాటి సర్రాజు భౌతిక దేహానికి జగన్ నివాళులర్పించనున్నారు. సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు అర్ధరాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
Next Story

