Wed Mar 18 2026 02:01:11 GMT+0530 (India Standard Time)
జగన్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించనున్నారు./జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం, విశాఖపట్నంలో జగన్ పర్యటింనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో ఐటీ టెక్ హబ్ ను జగన్ ప్రారంభించనున్నారు. జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
రేపు విశాఖ పర్యటనకు...
అయితే జగన్ కు స్వాగతం తెలుపుతూ వెలిసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ విశాఖ పర్యటకు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. రేపు ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి దంపతులను కూడా ఆశీర్వదించనున్నారు. ఎంపీ ఇంటికి వెళ్లే మార్గంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Next Story

