Sun Mar 22 2026 06:27:10 GMT+0530 (India Standard Time)
రేపు విశాఖకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు

విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. మిలాన్ 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నరాు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్ విశాఖకు చేరుకుంటారు.
నావల్ డాక్ యార్డులో....
విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డుకు వెళ్లి అక్కడ జరగనున్న కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. తర్వాత ఐఎన్ఎస్ వేలా సబ్ మెరైన్ ను జగన్ సందర్శిస్తారు. తర్వాత సాయంత్రం ఆర్కే బీచ్ కు వెళ్లి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్ 2022 లో పాల్గొని జగన్ ప్రసంగించనున్నారు.
Next Story

