Sun Mar 22 2026 03:23:10 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరతారు. విశాఖలోని సాగర తీరాన్ని పర్యవేక్షించేందుకు పార్లే ఫర్ ఓషన్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్సలంలో ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య ఎంవోయూ కుదరనుంది. బీ్ పర్యవేక్షణ కోసమే ప్రధానంగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంటుంది.
బీచ్ ను శుభ్రపర్చేందుకు...
బీచ్ ను శుభ్రపర్చే కార్యక్రమం జరగనుంది. దాదాపు ఇరవై వేల మందితో 28 కిలోమీటర్ల వరకూ బీచ్ ప్రాంతాన్ని శుభ్రం చేస్తారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన ఐదు వేల మందికి ముఖ్యమంత్రి జగన్ ధృవపత్రాలను అందచేస్తారు. విశాఖ నుంచి భీమిలీ వరకూ ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 28 కిలోమీటర్ల మేర బీచ్ ను శుభ్రం చేయనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే జగన్ తిరిగి మధ్యాహ్నం 1.55 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Next Story

