Fri Dec 05 2025 12:42:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో శ్రీ శారదపీఠాన్ని సందర్శించున్నారు. శారదాపీఠంలోని శ్రీ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి విశాఖకు జగన్ చేరుకుంటారు.
రాజశ్యామల అమ్మవారిని...
జగన్ పర్యటనతో విశాఖలో ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చినముష్టివాడలోని శారదపీఠం వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. జగన్ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని తిరిగి తాడేపల్లి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. జగన్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

