Sun Mar 08 2026 07:51:31 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగింపు వేడుక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందచేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటారు.
ఆడుదాం ఆంధ్రలో పాల్గొని...
పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళతారు. అక్కడ జరిగే క్రికెట్ ఫైనల్స్ ను చూస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం విజేతలకు బహుమతులు అందచేస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

