Fri Mar 20 2026 12:04:54 GMT+0530 (India Standard Time)
జగన్ విశాఖ టూర్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన విశాఖలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగన్ వాహనమిత్ర లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి 11.05 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్ కు చేరుకుంటారు.
వాహనమిత్ర లబ్దిదారులతో...
అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశఅలించిన అనంతరం జగన్ వాహనమిత్ర లబ్దిదారులతో ఫొటో దిగుతారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం లబ్దిదారులకు నేరుగా చెక్కులను పంపిణీ చేశారు. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

