Wed Mar 18 2026 09:32:36 GMT+0530 (India Standard Time)
విజయవాడలో జగన్ పర్యటన నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అక్కడ జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారని సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించాయి.
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో....
ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Next Story

