Sun Mar 22 2026 01:42:19 GMT+0530 (India Standard Time)
నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటన ఉండనుంది. రెండు ప్రయివేటు కార్యక్రమాలే కావడంతో పార్టీ నేతలకు మాత్రమే ఆహ్వానం ఉంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరే జరగన్ దాకమర్రికి చేరుకుని అక్కడ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
వివాహ వేడుకలకు...
అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకోనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జరగనున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా రెండు జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

