Thu Mar 19 2026 16:58:41 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి జిల్లా పర్యటనకు రానున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి జిల్లా పర్యటనకు రానున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.45 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడ నుంచి రూరల్ మండలంలోని పేరూరు చేరుకుని వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో శ్రీకాళహస్తికి బయలుదేరుతారు. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి భూమి పూజ చేస్తారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమవుతారు.
పరిశ్రమలకు.....
800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పరిశ్రమ ద్వారా పది వేల మందికి ఉపాధి లభిస్తుంది. 290 ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఆ పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లలో ఉన్న టీసీఎల్, సన్నీ ఒపోటెక్, డిక్సన్, పాక్స్ లింక్, కంపెనీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి జగన్ మధ్యాహ్నం 3.50 గంటలకు జగన్ తాడేపల్లి చేరుకున్నారు.
Next Story

