Thu Mar 19 2026 13:46:05 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతి, నంద్యాలకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 3.15 గంటలకు నంద్యాలలోని జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ ఈవో ధర్మారెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ధర్మారెడ్డి కుమారుడు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
చెవిరెడ్డి ఇంటికి వెళ్లి...
అనంతరం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టకు చేరుకుని 4.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి 5.10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తుమ్మలగుంటలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళతారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో సీఎం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతారు. అనంతరం సాయంత్రం ఆరుగంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకోనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
Next Story

