Sat Mar 07 2026 20:10:48 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రైలు ప్రమాద స్థలికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైలు ప్రమాద స్థలికి నేడు వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైలు ప్రమాద స్థలికి నేడు వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు బయలుదేరి జగన్ విజయనగరం జిల్లాకు బయలుదేరి వెళతారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను భద్ర పర్చారు. మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు.
సహాయక చర్యలు...
రైలు ప్రమాదం జరిగిన స్థలానికి కూడా ముఖ్యమత్రి జగన్ చేరుకుంటారు. అక్కడి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది అడిగి తెలుసుకుంటారు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో పథ్నాలుగు మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. మృతులంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story

