Thu Mar 19 2026 08:54:08 GMT+0530 (India Standard Time)
రేపు తెనాలికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తెనాలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తెనాలిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.55 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బయలుదేరి 10.15 గంటలకు హెలికాప్టర్ లో తెనాలికి చేరుకుంటారు. తెనాలిలోని కవిరాజ లే అవుట్ లోని హెల్ ప్యాడ్ కు చేరుకుంటారు.
రైతుల ఖాతాలలో....
అనంతరం 10.35 గంటలకు వ్యవసాయ మార్కెట్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను తొలుత జగన్ పరిశీలిస్తారు. అనంరతం 12.15 గంటల వరకూ వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఇన్పుట్ సబ్బిడీని రైతులకు విడుదల చేస్తారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం 12.20 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో తాడేల్లికి బయలుదేరి వెళతారు. జగన్ పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

