Thu Mar 19 2026 12:04:13 GMT+0530 (India Standard Time)
రేపు సిక్కోలుకు జగన్
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేటలో పర్యటిస్తారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు మూలపేట చేరుకుంటారు. 10.30 నుంచి 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలను జగన్ నిర్వహిస్తారు.
నిర్వాసిత కాలనీకి....
ఉదయం 11.25 గంటల నుంచి– 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో కూడా జగన్ పాల్గొంటారు. ఉదయం 11.40 గంటలకు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

