Tue Mar 31 2026 23:48:22 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో నరసన్నపేటకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పత్రాలను ఆయన లబ్దిదారులకు అందజేయనున్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ నరసన్నపేటకు బయలుదేరారు. 10.50 ప్రాంతంలో జగన్ నరసన్నపేటకు చేరుకుంటారు. అక్కడ జూనియర్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
లబ్దిదారులకు...
జగన్ కార్యక్రమం ఉండటంతో 7.29 లక్షల మంది రైతుల భూ హక్కు పత్రాలను అధికారులు రూపొందించారు. వీటిలో కొన్నింటిని సభా వేదికపై జగన్ లబ్దిదారులకు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ పరంగా కూడా జనసమీకరణ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పార్టీ నేతలు చూసుకుంటున్నారు.
Next Story

