Sat Mar 14 2026 21:05:26 GMT+0530 (India Standard Time)
రేపు పెడన పర్యటనకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కృష్ణా జిల్లా పెడనలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నాలుగో విడత నేతన్న నేస్తం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం బంటుమిల్లిలో జరిగే బహిరంగ సభలో వైెఎస్ జగన్ పాల్గొననున్నారు.
లబ్దిదారుల ఖాతాల్లో...
రేపు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ బయలుదేరతారు. 10.40 గంటలకు పెడన చేరుకుని బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. లబ్దిదారులకు వైఎస్సార్ నేతన్న హస్తం పథకం కింద నగదును అందించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Next Story

