Thu Mar 19 2026 06:45:42 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు నూజివీడుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ తొలుత స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
పోడు భూములకు....
ముఖ్యమంత్రి జగన్ నూజివీడు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లంక భూములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఆయన పాల్గొననుండటంతో పెద్దయెత్తున ప్రజలను తరలించేందుకు నేతలు శ్రమిస్తున్నారు. బహిరంగ సభలోనే లంక భూములకు సంబంధించిన పట్టాలను అందచేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. ఆ తర్వాత బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

