Tue Mar 17 2026 05:59:57 GMT+0530 (India Standard Time)
రేపు నెల్లూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 2.30 గంటలకు నెలలూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. అక్కడ వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి బయలుదేరి వస్తారు.
జయహో బీసీ సభకు...
రేపు ఉదయం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. జయహో బీసీ సభకు ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జగన్ అక్కడే ఉంటారు. బీసీలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందీ జగన్ ఈ సభలో వివరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నెల్లూరు బయలుదేరి వెళతారు.
Next Story

