Wed Jan 21 2026 02:02:42 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మార్కాపురంకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నగదును మహిళల ఖాతాల్లో జగన్ చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పది హేను వేల రూపాయల నగదును జమ చేయనున్నారు. ఈ ఏడాది రెండో విడత నిధులను జగన్ విడుదల చేయనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం...
రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రకులాలకు చెందిన పేద మహిళలు 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఏటీ పదిహేను వేల చొప్పున మూడేళ్లలో 45 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మార్కాపురంలో 1700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ముందగా అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. అనంతరం మార్కాపురం నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. నేతలు కూడా జగన్ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

