Thu Mar 19 2026 07:21:46 GMT+0530 (India Standard Time)
నేడు మదనపల్లెకు జగన్
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. విద్యాదీవెన కింద నాలుగో త్రైమాసికం నిధులను ఈరోజు లబ్దిదారుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నగదును జమ చేయనున్నారు. మదనపల్లెలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు.
జగనన్న విద్యాదీవెన...
గన్నవరం విమానాశ్రయం నంచి రేణిగుంటకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళతారు. 11 గంటలకు మదనపల్లెలోని బీటీ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభ జరిగే ప్రాంతానికి వెళతారు. విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేస్తారు. అనంతరం సభలో ప్రసంగించి తిరిగి 3.10 గంటల సమయంలో తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

