Sat Mar 07 2026 14:54:52 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు నంద్యాలలో జగన్ సభ
ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న ఇడుపుల పాయలో మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించిన జగన్ రాత్రి ఎర్రగుంట్లలో బస చేశారు. ఉదయం పది గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఎర్రగుంట్లలో ప్రజలతో జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రజలతో సమావేశమై...
వివిధ వర్గాలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. జగన్ బస్సు యాత్ర ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ జరగనుంది. మొత్తం 21 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Next Story

