Thu Jan 16 2025 22:49:14 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రేపు వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు
![ys jagan. chief minister, shocked, bus accident ys jagan. chief minister, shocked, bus accident](https://www.telugupost.com/h-upload/2024/02/26/1594165-ys-jagan.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రేపు ఉదయం 830 గంటలకు తాడేుపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోకి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి జగన్ భూమి పూజను నిర్వహించనున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా బయలుదేరి వెళతారు.
బనగానపల్లిలో నేరుగా...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేస్తారు. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద యెత్తున ప్రజలను సమీకరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.
Next Story