Fri Dec 05 2025 15:09:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ కృష్ణా జిల్లాలో పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడనలో జరిగే వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. పెడన - బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ నిధులు జమ చేయనున్నారు. ఏడాదికి ప్రతి నేతన్నకు 24 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికి మూడేళ్లుగా ఈ పథకం కింద నేత కార్మికులకు నిధులను అందచేయనున్నారు.
నేతన్నల కోసం...
ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఐదు విడతల్లో ప్రతి నేతన్న కుటుంబానికి 1,20,000 లను ప్రభుత్వం అందిస్తుంది. వారి ఆసరా కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగ్ 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. అక్కడ లబ్దిదారులతో నేరుగా మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Next Story

