Thu Mar 19 2026 05:05:28 GMT+0530 (India Standard Time)
రేపు కాకినాడకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాపునేస్తం పథకం మూడో విడత సాయాన్ని అందజేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాపునేస్తం పథకం మూడో విడత సాయాన్ని అందజేయనున్నారు. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో వైఎస్ జగన్ పర్యటన ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి జగన్ 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు.
కాపు నేస్తం నిధులను...
అక్కడ కాపు నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం సాయం చేయడానికి ముందు వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి 1.30 గంటలకు తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

