Sun Feb 01 2026 14:18:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సామర్లకోటకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బయలుదేరి ఆయన పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సామర్లకోటకు చేరుకుంటారు. సామర్లకోటలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జగనన్న కాలనీలో లబ్దిదారుల ఇళ్లను జగన్ స్వయంగా పరిశీలించనున్నారు. సామూహిక గృహ ప్రవేశాల్లో జగన్ పాల్గొననున్నారు.
జగనన్న కాలనీని...
అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. జగనన్న లబ్దిదారులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు కూడా పెద్దయెత్తున జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విపక్షాలు ఎటువంటి నిరసనలు తెలియజేయకుండా పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Next Story

