Thu Mar 19 2026 15:56:43 GMT+0530 (India Standard Time)
రేపు కడపకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ 10 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. కడప జిల్లాలోని పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మున్సిపల్ ప్రజాప్రతినిధులను కలవనున్నారు. ఒంటి గంట వరకూ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.
నేరుగా ప్లీనరీకి...
మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లికి చేరుకోనున్న జగన్ అక్కడ స్థానికులతో సమావేశమవుతారు. సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ కు చేరుకుని నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా 11 గంటలకు వైసీపీ ప్లీనరీకి చేరుకుంటారు.
Next Story

