Thu Mar 19 2026 13:59:00 GMT+0530 (India Standard Time)
రేపు బిజీగా కడపలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెను చేరుకుంటారు. అక్కడ జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూమి పూజలో పాల్గొంటారు. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
పులివెందులలో...
అనంతరం స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అధికారులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. పులివెందులలోని ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరుగుతున్న మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story

