Thu Mar 19 2026 13:59:00 GMT+0530 (India Standard Time)
నేడు కడపకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండురోజుల పాటు ఆయన కడపల జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో జగన్ 11.50 గటలకు కడపకు చేరుకుంటారు. లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్ద చేరుకుని అక్కడ బోటింగ్ జెట్టిని జగన్ ప్రారంభింస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం లింగాల మండలం నాయకులతో ఆయన సమావేశం అవుతారు.
వివాహ వేడుకలో....
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఇడుపులపాయ నుంచి బయలుదేరిన జగన్ 9.15 ప్రాంతంలో కదిరి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ గార్డెన్ కు చేరుకుని ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

