Sat Dec 06 2025 12:23:28 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజులు కడపలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన సొంత జిల్లా కావడం, క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్ పాల్గొననుననారు. ఈ నెల 23వ తేదీన కమలాపురం, 24న పులివెందులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
క్రిస్మస్ సందర్భంగా...
డిసెంబరు 25న సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యనేతలతో జగన్ ఈ పర్యటనలో సమావేశమయ్యే అవకాశముంది.
Next Story

