Thu Mar 19 2026 15:55:20 GMT+0530 (India Standard Time)
మూడు రోజలు జగన్ కడపలోనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టంబరు 1వ తేదీన ఆయన కడప జిల్లాకు బయలుదేరుతారు. మూడో తేదీ వరకూ ఆ జిల్లాలో పర్యటిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. దీంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మంత్రివర్గ సమావేశం 7న...
దీంతో సెప్టంబరు 1వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జగన్ కడప జిల్లా పర్యటన ఉండటంతో ఈ సమావేశం వాయిదా వేశారు. తిరిగి సెప్టంబరు ఏడో తేదీన మంత్రి వర్గం సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Next Story

