Thu Mar 19 2026 04:28:31 GMT+0530 (India Standard Time)
రేపు కడప జిల్లాకు జగన్.. మూడు రోజులు అక్కడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 25వరకూ జగన్ కడప జిల్లాలోనే ఉంటారు. ఈ పర్యటనలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ, పులివెందుల, కొప్పర్తి, ప్రొద్దుటూరు, గోపవరం ప్రాంతాల్లో ముందుగా నిర్ణయించిన అభివృద్ధి పనులను జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు జగన్ కడపకు బయలుదేరుతారు.
క్రిస్మస్ వేడుకల్లో...
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్ కిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. పులివెందుల చర్చిలో జరిగే ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారు. జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలు బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటుండటంతో వాటి ఏర్పాట్లపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు.
Next Story

