Thu Mar 19 2026 04:28:30 GMT+0530 (India Standard Time)
రేపు గుంటూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో జగన్ పాల్గొంటారు. అనంతరం జగన్ మెడికల్ కళాశాల 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.
పల్నాడు జిల్లాలో...
అంతకు ముందు పల్నాడు జిల్లాలో జగన్ పర్యటిస్తారు. యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్ లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసిప్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసంలో ఆయన బయలుదేరి ఉదయం 9.25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరు జిల్లకు వస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

