Wed Mar 18 2026 23:55:23 GMT+0530 (India Standard Time)
గుడివాడకు సిఎం జగన్
గుడివాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. మే 19వ తేదీన జగన్ గుడివాడ పర్యటన ఖరారయింది

గుడివాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. మే 19వ తేదీన జగన్ గుడివాడ పర్యటన ఖరారయింది. గుడివాడలో వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. తొమ్మిది వేల టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులకు అందచేయనున్నారు.
22న మచిలీపట్నంలో...
అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే మే 22వ తేదీన మచిలీపట్నంలో జగన్ పర్యటించనున్నారు. బందరు పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. జగన్ పర్యటన కోసం అధికారులు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

