Wed Mar 25 2026 15:59:28 GMT+0530 (India Standard Time)
నేడు జగనన్న చేదోడు
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. ఈ సభలోనే జగన్ లబ్దిదారులకు జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఒక్కొక్క కుటుంబానికి...
రజకులు, నాయీబ్రహ్మణులు, టైలర్ల జీవితాల్లో మార్పు తీసుకు రావాలని ఈ జగనన్న చేదోడు కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. నాలుగో విడత ఈ కార్యక్రమం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి పది వేల సాయం జగన్ అందించనున్నారు. మొత్తం 3.25 లక్షల మంది లబ్దిదారులకు 325 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేస్తారు.
Next Story

