Thu Mar 19 2026 17:20:59 GMT+0530 (India Standard Time)
నేడు నిడదవోలుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలులో ఆయన పర్యటన సాగనుంది. నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడదవోలుకు చేరుకుంటారు.
వివాహ వేడుకకు...
పదకొండు గంటలకు గాంధీనగర్ లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్ లో జరగనున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్ కు జగన్ హాజరవుతారు. వధూవరులను దీవిస్తారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి 12.25 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story

