Mon Mar 30 2026 23:39:59 GMT+0530 (India Standard Time)
దెందులూరుకు జగన్
ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు

ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు. జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దెందులూరులో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జగన్ వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు.
భారీ బహిరంగ సభలో...
జగన్ పాల్గొనే భారీ బహిరంగ సభకు వేలాదిగా జనాన్ని సమీకరించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా జగన్ పాల్గొనే ప్రాంతంలో పెద్దయెత్తున పోలీసులు మొహరించేందుకు ముందస్తు సన్నాహాలు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సమీక్షించారు.
Next Story

