Thu Mar 26 2026 11:00:48 GMT+0530 (India Standard Time)
నేడు కూడా ఢిల్లీలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కూడా ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కూడా ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, వివిధ ప్రయోజనాలపై కేంద్ర మంత్రులను కలిసి జగన్ వినతి పత్రం సమర్పించనున్నారు. ఈరోజు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన జాతీయ రహదారులపై జగన్ గడ్కరీని కలసి చర్చించారు.
నిన్న ప్రధానితో.....
నిన్న ఢిల్లీకి చేరుకున్న జగన్ ప్రధాని మోదీతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై జగన్ చర్చించారు. ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. అనంతరం గవర్నర్ ను కలవనున్నారు.
Next Story

