Thu Mar 19 2026 05:08:29 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భీమవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనగన్న విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భీమవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనగన్న విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి జులై - సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జగన్ జమ చేయనున్నారు. దాదాపు 8,09,039 మంది ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 584 కోట్ల రూపాయల నిధులను సిద్ధం చేసింది.
భీమవరంలో బహిరంగ సభ...
పదకొండు లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగన్ ఈ నిధులను జమ చేయనున్నారు. ఉదయం పది గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు అనంతరం అక్కడ జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు
Next Story

