Thu Mar 19 2026 04:38:06 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు భీమవరానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ భీమవరం చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
జగనన్న విద్యాదీవెన...
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. జగన్న విద్యా దీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

