Thu Mar 19 2026 02:50:45 GMT+0530 (India Standard Time)
రేపు బాపట్ల జిల్లాకు సీఎం జగన్
బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పర్యటించనున్నారు. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు

బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పర్యటించనున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు వారు వినియోగించే బైజూస్ యాప్ ను కూడా జగన్ ప్రారంభించనున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా...
ఈ సందర్భంగా స్థానిక ఏవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Next Story

