Sat Mar 07 2026 13:36:04 GMT+0530 (India Standard Time)
రేపు అవనిగడ్డకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అవనిగడ్డలో పర్యటించనున్నారు. రైతులకు క్లియరెన్స్ పత్రాలను జగన్ అందచేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అవనిగడ్డలో పర్యటించనున్నారు. రైతులకు క్లియరెన్స్ పత్రాలను జగన్ అందచేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి కార్యాలయం నుంచి బయలుదేరనున్న జగన్ 10.55 గంటలకు అవనిగడ్డకు చేరుకుంటారు.
రైతులకు...
అవనిగడ్డ డిగ్రీకళాశాలలో జరగనున్న బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. నిషేధిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు జగన్ అందచేయనున్నారు. అనంతరం తిరిగి అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

