Tue Mar 31 2026 21:54:36 GMT+0530 (India Standard Time)
రేపు అన్నమయ్య జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మదనపల్లెలో జరగనున్న విద్యాదీవెన కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. విద్యాదీవెన కింద నాలుగో త్రైమాసికం నిధులను జగన్ మదనపల్లెలో విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
జగనన్న విద్యా దీవెన...
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్ 11 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ బీటీ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యాదీవెన కింద నిధులను బటన్ నొక్కి నిధులను లబ్దిదారులకు అందచేస్తారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story

