Tue Mar 24 2026 03:36:16 GMT+0530 (India Standard Time)
Ys jagan : నేడు రెండు జిల్లాలకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. ఈరోజు అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం కుమారుడి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడులకు కూడా జగన్ హాజరవుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అభివృద్ధి కార్యక్రమాలను...
తర్వాత జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు వెళతారు. అక్కడ శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పులివెందులలో శిల్పారామంను కూడా ప్రారంభించనున్నారు. వీటితో పాటు పలు కార్యక్రమాలను జగన్ ప్రారంభిస్తారు. ఈరోజు రాత్రికి ఇడుపులపాయ వెళ్లి అక్కడే బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
Next Story

