Sun Mar 08 2026 02:54:55 GMT+0530 (India Standard Time)
నేడు అచ్యుతాపురానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ కు వెళ్లనున్నారు. అక్కడ టైర్ల యూనిట్లతో పాటు మరికొన్ని పరిశ్రమలను జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి మూడు గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
టైర్ల ఫ్యాక్టరీకి...
అచ్యుతాపురం సెజ్ లో నెలకొల్పిన అలయన్స్ టైర్ల కంపెనీ యూనిట్ ను జగన్ ప్రారంభించనున్నారు. 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. తొలిదశలో 1,384 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నేటి నుంచి కార్యకలాపాలను పరిశ్రమ ప్రారంభించనుంది. జపాన్ కు చెందిన యకహోమా గ్రూపు ఈ కంపెనీని నెలకొల్పింది. రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్లకు సంబంధించి రెండు వేల మందికి ఉపాధి కలగనుంది.
Next Story

