Tue Mar 17 2026 07:51:39 GMT+0530 (India Standard Time)
నేడు నెల్లూరుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించిన జగన్ నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ రెండు జిల్లాల్లోనూ భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది రైతులు పంటలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
భరోసా ఇచ్చేందుకు....
ీఈ సమయంలో వారికి జగన్ భరోసా కల్పించనున్నారు. నిన్న కడప జిల్లా పర్యటనలోనే బాధితులకు కొన్ని హామీలు ఇచ్చారు. ఈరోజు జగన్ నెల్లూరు సిటీ, రూరల్ తో పాటు కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Next Story

