Thu Mar 19 2026 04:28:12 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి జగన్ జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జిల్లాల్లో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జిల్లాల్లో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు జగన్ కడప జిల్లాలోపర్యటించి వరద నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. నేరుగా బాధితులతోనూ జగన్ మాట్లాడతారు. వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా అందాయన్నది స్వయంగా జగన్ అడిగి తెలుసుకుంటారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కూడా పర్యటిస్తారు. మొత్తం రెండు రోజుల పాటు జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.
స్వయంగా వెళ్లి....
జగన్ వరద బాధిత ప్రాంతాలకు వెళ్లలేదని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తాను వెళితే సహాయకార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని జగన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ పర్యటనలో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలిస్తారు.
Next Story

