Thu Mar 19 2026 04:41:46 GMT+0530 (India Standard Time)
నేడు బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న చేదోడు పథకం కింద ఈ నిధులను తాడేపల్లి కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో జగన్ జమ చేయనున్నారు. ఈ పథకం కింద మొత్తం 285.35 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు ఈ నిధులు విడుదల చేయనున్నారు.ఒక్కొక్కరికి ఈ పథకం కింద పదివేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది.
గుర్తించిన లబ్దిదారులు....
రాష్ట్రంలో రజక వృత్తి చేసుకుంటూ, దర్జీ, నాయీబ్రాహ్మణ దుకాణాలను నిర్వహించుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద మొత్తం 2,85,350 మంది లబ్దిదారులను గుర్తించారు. వీరిలో దర్జీ వృత్తి చేసుకునే వారు 1,46,103 మంది, రజకులు 98,439 మంది, నాయీబ్రాహ్మణులు 40,808 మంది ఉన్నారు.
Next Story

