Thu Mar 19 2026 00:49:19 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు రాష్ట్రానికి వైఎస్ జగన్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు. పది హేను రోజుల తర్వాత ఆయన విదేశీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఆయన రాత్రి లండన్ కు బయలుదేరి వెళ్లారు.
పదిహేను రోజుల తర్వాత...
అయితే విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. నిన్న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమయి ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్ లోనూ పర్యటించారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

