Wed Mar 18 2026 02:33:43 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు ఎమ్మిగనూరుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మిగనూరుకు చేరుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మిగనూరుకు చేరుకోనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. నిన్న నంద్యాల సభలో ప్రసంగించిన అనంతరం రాత్రి పెంచికలపాడు వద్ద బస చేశారు. ఈరోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి చికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు.
వీవర్స్ కాలనీ గ్రౌండ్స్ లో...
మధ్యాహ్నం రాళ్లదొడ్డి వద్ద భోజన విరామానికి ఆగుతారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. అక్కడి వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అరెకల్, ఆదోని క్రాస్, విరూపాపురం, బెణిగెరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హఆలుకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ నేతలు పూర్తి చేశారు.
Next Story

