Thu Mar 26 2026 04:44:38 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నీతి అయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొననున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న జగన్ కు వైసీపీ పార్లమెంటు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు 9.30 గంటలకు జగన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకని సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు.
వీలయితే....
సమావేశం పూర్తయిన తర్వాత జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆయన బయలు దేరి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story

